ఆ అజెండాతోనే సీఎం జగన్‌ సమీక్షలు

ఆ అజెండాతోనే సీఎం జగన్‌ సమీక్షలు

చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల భేటీ ముగిసింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో డిస్కస్‌ చేశారు. ఈ భేటీకి ముఖ్య నేతలంతా హాజరయ్యారు.

టీడీపీపై నిందలు వేయాలనే అజెండాతోనే సీఎం జగన్‌ సమీక్షలు చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి కళా వెంకట్రావు. గతంలో వైఎస్‌ హయాంలో ఎన్నో సబ్‌ కమిటీలు వేశారని.. ఇప్పుడు అదే తరహాలో జగన్‌ సబ్‌ కమిటీలు వేస్తున్నారని ఆరోపించారు. ఇది కక్షపూరిత, అనాలోచిత చర్య తప్ప మరొకటి కాదన్నారు. కేంద్ర మార్గ దర్శకాల ప్రకారమే విద్యుత్‌ కొనుగోళ్లు జరిగాయన్న కళా.. కొత్త ప్రభుత్వంలో విద్యుత్‌ కోతలు ఎక్కువయ్యాయని ఆరోపించారు.

Tags

Next Story