సంచలన నిర్ణయం తీసుకున్న క్రిస్‌ గేల్‌

సంచలన నిర్ణయం తీసుకున్న క్రిస్‌ గేల్‌

వెస్టిండీస్‌ విధ్వంసక క్రికెటర్‌, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో క్రికెట్ కు రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఈ ఏడాది ఆగస్టు–సెప్టెంబర్‌లో స్వదేశంలో భారత్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీసే తనకు చివరిదని గేల్‌ స్పష్టం చేశాడు. 39 ఏళ్ల గేల్‌ వరల్డ్‌కప్‌ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు గతంలోనే ప్రకటించాడు. కాగా గేల్‌ ఇప్పటివరకూ 103 టెస్ట్‌లు ఆడి 42.19 సగటుతో 7,215 పరుగులు చేశాడు. అలాగే 294 వన్డేల్లో 10,345, 58 టీ20ల్లో 1,627 పరుగులు చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story