నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. పాత సచివాలయంలోని డి బ్లాక్‌ వెనుక భాగం పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో నూతన సచివాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

గడ్డపారతో తవ్వి.. తరువాత సిమెంట్‌ వేసి కేసీఆర్‌ స్వయంగా పునాది రాయి వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నూతన సచివాలయాన్ని సుమారు 400 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే కొత్త సచివాలయంలో మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులు, సెక్షన్లు అన్నీ ఒకేచోట వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. కొత్త సచివాలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా, అన్ని సౌకర్యాలతో పూర్తి వాస్తు ప్రకారం నిర్మించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story