వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి

ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ అనుచరులను పీవీ నరసింహారావు అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి పీవీ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును కూల్చి పీవీ పెద్ద తప్పు చేశారని, దాని వల్ల కాంగ్రెస్‌కు ముస్లింలు దూరమయ్యారన్నారు. అందుకే పీవీని గాంధీ కుటుంబం పక్కన పెట్టిందన్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపైనా నిప్పులు చెరిగారు చిన్నారెడ్డి. ప్రణబ్ ముఖర్జీ కూడా పీవీలాంటి వారేనని.. ఆయన్ను కాంగ్రెస్ దేశానికి రాష్ట్రపతిని చేసిందని అన్నారు. ప్రణబ్‌ముఖర్జీ నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సభకు వెళ్లి భారతరత్న అవార్డు తెచ్చుకున్నారని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ బీజేపీకి ఎలాంటి ప్రయోజనం చేయలేదు కాబట్టే.. ఆ పార్టీ ఆయనను పొగడదన్నారు చిన్నారెడ్డి.
చిన్నారెడ్డి వ్యాఖ్యలపై రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయన్నది హాట్ టాపిక్‌గా మారింది. పీవీ అభిమానులు, కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com