పీసీసీ షోకాజ్‌ నోటీస్‌కు రిప్లై ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

పీసీసీ షోకాజ్‌ నోటీస్‌కు రిప్లై ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌కు రిప్లై ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. తన పీఏ ద్వారా నోటీస్‌ రిప్లైని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ కోదండరెడ్డికి పంపారు. అయితే వివరణలో ఎక్కడా కూడా తాను మాట్లాడింది తప్పు అని ఒప్పుకోలేదన్నారు కోదండరెడ్డి. షోకాజ్‌ నోటీస్‌కు రిప్లై ఇచ్చినా.. ఆయన మాట్లాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు కోదండరెడ్డి. మొదటి షోకాజ్‌కు అధికారికంగా రిప్లై ఇవ్వకున్నా.... కుంతియాను కలిసి క్షమాపణలు కోరినందువల్లే టిక్కెట్‌ ఇచ్చామన్నారు. రోజగోపాల్‌ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంలో జాప్యం జరిగిన మాట వాస్తమన్నారు కోదండరెడ్డి. సస్పెన్షన్‌ అంశం అధిష్టానం పరిధిలో ఉందని, నిర్ణయం వారు తీసుకోవాలన్నరు.

Tags

Read MoreRead Less
Next Story