చెల్లి ప్రేమ వ్యవహారం.. ఒకేసారి నలుగురు అక్కాచెల్లెళ్లు..

చెల్లి ప్రేమ వ్యవహారం.. ఒకేసారి నలుగురు అక్కాచెల్లెళ్లు..

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి నలుగురు అక్కా చెల్లెళ్లు పురుగుల మందు తాగారు. జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, సారయ్య దంపతులకు ఆరుగురు సంతానం. ఐదవ కుమార్తె ప్రేమ వ్యవహారంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇక తమకు పెళ్లిల్లు జరగడం కష్టమని నలుగురు అక్కాచెల్లెళ్లు వెంకటమ్మ, అనిత, కృష్ణవేణి, యాదమ్మలు భావించారు.

చెల్లెలి ప్రేమ వ్యవహారంతో మనస్థాపానికి గురై నలుగురు లోకాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తల్లి సాయమ్మ, చిన్న చెల్లెను ఇంట్లోంచి బయటికి పంపి పురుగుల మందు తాగారు. బలవంతంగా ఇంట్లోంచి బయటికి పంపడంతో తల్లికి అనుమానం వచ్చింది. చుట్టుపక్కలవారు తలుపులు పగలగొట్టి వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story