జులై 1నుంచి కొత్త రూల్స్..

ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపే పలు అంశాలు జులై 1 నుంచి మారనున్నాయి. బ్యాంకుల దగ్గర నుంచి కార్ల కంపెనీల వరకు పలు విషయాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించేందుకు చార్జీలు వసూలు చేయవద్దని భారతీయ రిజర్వు బ్యాంక్ ఇప్పటికే బ్యాంకులను ఆదేశించింది. ప్రభుత్వ రంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఎస్‌బీఐ తన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటును రేపో రేటు తగ్గినప్పుడల్లా తగ్గిస్తుంది. ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులో బేసిక్ అకౌంట్ కలిగిన వారు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన అవసరం లేకుండానే ఇతర సేవలు పొందొచ్చు. నాలుగు సార్లు ఏటీఎం నుంచి ఉచితంగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచుల్లో ఎన్నిసార్లైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఏటీఎం కమ్ డెబిట్ కార్డును ఫ్రీగా పొందొచ్చు. ఈ నిబంధన జులై 1 నుంచి అమలులోకి వస్తుంది. వాహన కంపెనీలైన టాటా మోటార్స్ ఇప్పటికే కార్ల ధరలు పెంచేసింది. హోండా కార్స్ కూడా వచ్చే నెల నుంచి ధరలు పెంచబోతోంది. మహీంద్రా కంపెనీ కార్ల ధరలు కూడా జులై 1 నుంచి రూ.36,000 పెరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com