ప్రజా వేదిక కూల్చివేత.. ఆ అంచనా సాధ్యం కాలేదు..

ప్రజా వేదిక కూల్చివేత.. ఆ అంచనా సాధ్యం కాలేదు..

ఉండవల్లిలో ప్రజా వేదిక కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి నుంచి కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్న సీఆర్‌డీఏ అధికారులు.. 70 శాతానికి పైగా పూర్తి చేశారు. ఐరన్‌ రేకులతో నిర్మించిన పైకప్పు కావడంతో వాటిని తొలగించేందకు ఇవాళ సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉంది.

నిన్న రాత్రి వరకు కూల్చివేత పూర్తవుతుందని అంచనా వేశారు. అయితే.. అది సాధ్యం కాలేదు. భవనాన్ని పూర్తి నేలమట్టానికి మరికొంత సమయం పడుతుందంటున్నారు సీఆర్‌డీఏ అధికారులు.

జేసీబీలు, సుమారు వంద మంది కూలీలతో ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రజావేదిక వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

Tags

Read MoreRead Less
Next Story