ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు..

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివనగర్ మండలం వడ్లూర్ క్రాసింగ్‌ దగ్గర ఓ కారు అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు.

హైదరాబాద్‌ నుంచి రాకేశ్‌ తన కొడుకు అక్షరాభ్యాసం కోసం బాసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాకేశ్ భార్య, బావ మరిది, అత్త స్పాట్‌ లోనే మృతి చెందారు. రాకేశ్‌ కు కుడి భుజం విరిగింది. ఆయన మూడు సంవత్సరాల కుమారుడు అభిరామ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు కారు ఢీ కొనడంతో మంటలు వ్యాపించి లారీ పూర్తిగా దగ్ధమైంది.

Tags

Read MoreRead Less
Next Story