టీఆర్‌ఎస్‌ నాయకులకు టార్గెట్‌ నిర్ణయించిన కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ నాయకులకు టార్గెట్‌ నిర్ణయించిన కేసీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు నమోదు చేయాలని.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ నాయకులను ఆదేశించారు. మొత్తంగా కోటి సభ్యత్వాలు జరిగేలా చూడాలన్నారు. జులైలోగా సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినట్లే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గెలవాలని.. పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పరిపాలనపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని అధినేత నాయకులకు సూచించారు.

అనంతరం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేసీఆర్‌ తొలి సభ్యత్వం స్వీకరించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన 11 ప్రత్యేక కౌంటర్లలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు మంత్రులు, సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు మెంబర్‌షిప్‌ తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story