విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు

విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు

ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల రారాజు విరాట్‌కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 20వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. విండీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డ్ అందుకున్నాడు. కోహ్లీ 417 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయి అందుకోగా... గతంలో సచిన్ టెండూల్కర్, బ్రయాన్ లారా 453 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డ్ సాధించారు. దీంతో సచిన్‌,లారా రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. అలాగే ఈ మైలురాయి అందుకున్న మూడో భారత బ్యాట్స్‌మెన్‌గానూ ఘనత సాధించాడు. ఇంతకుముందు సచిన్ , ద్రావిడ్ మాత్రమే 20వేల పరుగుల ఫీట్ అందుకున్నారు. కోహ్లీ చాలా తక్కువ ఇన్నింగ్స్‌లలో 20 వేల పరుగులు పూర్తి చేశాడు. భారత కెప్టెన్ టెస్టుల్లో 131 , వన్డేల్లో 224 , టీ ట్వంటీల్లో 62 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

Tags

Read MoreRead Less
Next Story