తాగిన మైకంలో ఆపరేషన్ చేసిన డాక్టర్..!

తాగిన మైకంలో ఆపరేషన్ చేసిన డాక్టర్..!

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ ప్రైవేట్ వైద్యుడి నిర్వాకం, యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. బాడంగి మండలం కోడూరు గ్రామానికి చెందిన ఇప్పిలి రాము అనే యువకుడు కడుపునొప్పి రావడంతో బొబ్బిలిలోని డాక్టర్ రమేష్ కుమార్ కు చెందిన ఆర్కే ఆసుపత్రిలో వారం క్రితం జాయిన్ అయ్యాడు. వెంటనే ఆపరేషన్ చేయాలని..లక్ష ఖర్చవుతుందని చెప్పాడు డాక్టర్ రమేష్. చివరికి 55 వేలు తీసుకొని వరుసగా ౩ ఆపరేషన్లు చేసాడని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో డాక్టర్ మద్యం మత్తులో ఉన్నట్లు చెబుతున్నారు.

మొదట ఒక ఆపరేషన్ చేసిన డాక్టర్ రమేష్ ఆ తర్వాత పరిస్థితి సీరియస్ గా ఉందంటూ మరో రెండు ఆపరేషన్లు చేశాడు. ఇందుకోసం మరో 25 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. తీరా ఆపరేషన్ చేసి తర్వాత .. పేషెంట్ బతకడని చేతులెత్తేశాడు డాక్టర్. వేరే ఆసుపత్రికి తీసుకెళ్ళాలని చెప్పాడు. తాగిన మైకంలో ఆపరేషన్లు చేయడం వల్లే ఇలా జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రాముని తరలించారు..పోలీసులు సర్దిచెప్పడంతో వైద్యానికి అవసరమ్యయ్యే ఖర్చులు భరించేందుకు డాక్టర్ రమేష్ ఒప్పుకున్నాడు.. రాము పరిస్థితి ఇంకా విషమంగానే వుందని, మెరుగైన వైద్యం అందించాల్సిన ఉందని వైద్యులు చెబుతున్నారు.

Tags

Next Story