విజయసాయిరెడ్డి డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు - యనమల

విజయసాయిరెడ్డి డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు - యనమల

తప్పుడు నిర్ణయాలు, దుందుడుకు చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సీఎం జగన్ చీకటి యుగంలోకి నెడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు హయాంలో తీసుకున్న చర్యలపై విచారణకు ముఖ్యమంత్రి కేబినెట్ సబ్‌ కమిటీ వేయడంపై ఆయన మండిపడ్డారు. ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిని అందులో భాగస్వాములను చేయడం కుట్రగా యనమల అభివర్ణించారు. ప్రత్యేక ఆహ్వానితులంతా ఒకే సామాజిక వర్గం వారిని నియమించడం రాజకీయ దురుద్దేశమేనని విమర్శించారు. విచారణ పేరుతో ఆయా శాఖల్లో అభివృద్ధి, పేదల సంక్షేమాన్ని నిలిపివేస్తున్నట్టు యనమల ఆరోపించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి యనమల ఆరోపించారు. పరిపాలనలో అడుగడుగునా జోక్యం చేసుకుంటున్నారని విమర్శఇంచారు. కోర్టుకు హాజరయ్యే శుక్రవారం బ్యాచ్‌ అంతా కలిసి కూటమిగా ఏర్పడి టీడీపీని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు చేస్తోందని ఎద్దేవా చేశారు యనమల. కళంకిత మంత్రులను పక్కన పెట్టుకుని జగన్ ఎలా నీతులు చెప్తారని ప్రశ్నించారాయన. కాంట్రాక్టర్లను పిలిపించుకుని.. సెటిల్ చేసుకునేందుకే విచారణకు ఆదేశించారా అంటూ యనమల రామకృష్ణుడు అనుమానం వ్యక్తంచేశారు.

Tags

Next Story