తొలిసారి జమ్ము కశ్మీర్‌లో పర్యటించిన అమిత్ షా

కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్‌లో పర్యటించారు అమిత్ షా. రెండ్రోజుల పాటు పర్యటించిన ఆయన తొలిరోజు.... జమ్ముకశ్మీర్ భద్రతపై రివ్యూ చేశారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాతి పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించారు. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్ర భద్రతపై చర్చించారు..
గురువారం..... అమరవీరుడు అర్షద్ అహ్మద్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు అమిత్‌షా. అనంతనాగ్‌లో ఈ నెల 12న పారామిలటరీ బలగాలపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో వీరమరణం పొందిన అర్షద్ కుటుంబం నగరంలోని బాల్‌గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు..
దేశ రక్షణ కోసం అర్షద్ చేసిన త్యాగం ఎంతోమంది జీవితాలను కాపాడిందన్నారు అమిత్ షా. అర్షద్ ఖాన్ ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోందన్నారు. అర్షద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అర్షద్ ఖాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు... హోంమంత్రి హోదాలో తొలిసారిగా పర్యటించడం, పోలీసు కుటుంబాన్ని పరామర్శించడంతో.... జమ్మూకశ్మీర్‌కు అమిత్‌షా ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com