ఆంధ్రప్రదేశ్

కులాంతర వివాహం చేసుకుందని.. కన్న కూతురినే..

కులాంతర వివాహం చేసుకుందని.. కన్న కూతురినే..
X

చిత్తూరు జిల్లా పమలనేరులో పరువు హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందని.. కన్న కూతురినే తల్లిదండ్రులు చంపేశారు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న హేమావతి, కేశవులు.. ఇంటి నుంచి వెళ్లిపోయి వేరు కాపురం పెట్టుకున్నారు. 7 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చిన హేమావతి.. ఆస్పత్రి నుంచి తిరిగొస్తుండగా.. కుటుంబ సభ్యులు దారికాచి దాడి చేశారు. హేమావతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని కాలువపల్లి సమీపంలోని చెత్తపంట దగ్గర పడేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ పరువు హత్య విషయం బయటపడింది.

Next Story

RELATED STORIES