ఆర్ట్స్‌ కాలేజీలో గ్యాంగ్ వార్.. కామర్స్‌ బిల్డింగ్‌ ముందు సైన్సు స్టూడెంట్స్..

ఆర్ట్స్‌ కాలేజీలో గ్యాంగ్ వార్.. కామర్స్‌ బిల్డింగ్‌ ముందు సైన్సు స్టూడెంట్స్..

అనంతపురం జిల్లా ఆర్ట్స్‌ కాలేజీలో పోకిరీలు రెచ్చిపోయారు. కామర్స్‌ బిల్డింగ్‌ ముందు సైన్సు విద్యార్ధుల గ్యాంగ్‌ వార్ తారాస్థాయికి చేరింది. తోటి విద్యార్ధి శివయ్యను అల్లరిమూక అతి దారుణంగా బండరాళ్లు, బెల్టులతో కొట్టారు. కాళ్లతో తలపై తన్నారు. తీవ్రంగా కొట్టడంతో స్టూడెంట్‌ శివయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లారు. తోటి విద్యార్ధులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్ట్స్‌ కాలేజీలో ప్రతిరోజూ విద్యార్ధుల మధ్య గ్యాంగ్ వార్ జరుగుతున్నట్టు అక్కడి విద్యార్ధులు తెలుపుతున్నారు. కళాశాల ప్రిన్నిపాల్‌, ఫ్రొఫెషర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు స్టూడెంట్స్‌.

Tags

Next Story