లిఫ్ట్ అడిగి కారులో స్కూల్‌కి వెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజు..

లిఫ్ట్ అడిగి కారులో స్కూల్‌కి వెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజు..

చదవు మీద ఉన్న ఆసక్తి తో నిత్యం ఆ విద్యార్థి నకడ మార్గం ద్వార వెలుతుంటాడు. తను ఉంటున్న ఇంటి నుండి స్కూల్ కి మద్య దూరం 3కిలోమీటర్లు. ఎవరైన లిఫ్ట్ ఇస్తే సరి లేదంటే నడక మార్గమే శరణ్యం. ఇలా నడుచుకుంటు వెలుతున్న ఆ విద్యార్థి ఓ కారుని లిఫ్ట్ అడిగాడు. కారు ఎక్కిన తరువాత అబ్బాయి వివరాలు అడిగారు సదరు వ్యక్తి. తాను ఎంతో పెదరికంలో ఉన్నామని.. తండ్రికి రెండు కళ్లు కనిపించవని.. తల్లి కష్టార్జీత మీదే కుటుంబం నడుస్తుందని చెప్పుకోచ్చాడు. ఇంతలో స్కూల్ రానే వచ్చింది. స్కూల్ వద్ద ఆ విద్యార్ధిని దింపి వెల్లిపోయాడు. మరుసటి రోజు అబ్బాయికి సైకిల్ బహుమతిగా ఇచ్చాడు.

ఆ కారులో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి జవహర్ నగర్ మున్సిపల్ కమీషనర్ రఘు. లిఫ్ట్ అడిన అబ్బాయి పేరు ప్రభు తేజ్. జవహర్ నగర్ ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. ప్రభు తేజ్ రాజీవ్ గాంధీ నగర్ నుండి నిత్యం నడక మార్గం.. లేదంటే లిఫ్ట్ ఇస్తే వస్తుంటాడు. అనుకోకుండా సైకిల్ బహుమతిగా రావడంతో ప్రభు తేజ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కమీషనర్ అని తనకు తెలియదని ప్రభుతేజ్ అన్నారు. పెద్దయ్యాకా ఆర్మీలో జాయిన్ అవుతానని ప్రభుతేజ్ చెప్పుకోచ్చారు. జవహర్ నగర్ ప్రభుత్వ స్కూల్ కి ఎంతో దూరం నుండి విద్యార్ధులు వస్తుంటారని పాఠశాల ఉపాద్యాయులు తెలిపారు. ఎవరైన దాతలు ముందుకు వచ్చి పెద విద్యార్థులకు సాయం చేయాలంటున్నారు.ఇక తాను ఆఫీస్ కు వెలుతున్న తరుణంలో ప్రభుతేజ్ లిఫ్ట్ అడిగాడని కమీషన్ రఘు తెలిపారు. తన లాగే ప్రభుత్వ సిబ్బంది అయిన.. ప్రవైటు సిబ్బంది అయిన సాయం చేయడానికి ముందుకు రావాలని ఆయన అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story