రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసుకునే అమ్మాయిలకు మరిన్ని అవకాశాలు: పీయూష్ గోయల్

రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసుకునే అమ్మాయిలకు మరిన్ని అవకాశాలు: పీయూష్ గోయల్

రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే మహిళలు, పరీక్షకు హాజరైతే అప్లికేషన్ ఫీజు వెనక్కి ఇస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటుకు తెలిపారు. ఇంకా కొన్ని ప్రత్యేక కేటగిరి మహిళలకు.. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, భర్త నుంచి విడిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉన్న వారు రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయస్సును 35 ఏళ్లకు పొడిగించినట్లు చెప్పారు.

లెవెల్-1 కేటగిరీల్లో అర్హతల విషయంలోనూ మహిళలకు పీఈటీ నిబంధనలను సడలించినట్లు చెప్పారు. మహిళలు రైల్వేల్లో పనిచేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఇటీవల లోకోపైలెట్‌తో పాటు ఇతర టెక్నికల్ కేటగిరీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందన్నారు. ఇన్నాళ్లు పురుషులకు మాత్రమే అనుకున్న ఉద్యోగాలకు మహిళలు కూడా పోటీపడుతుండడం విశేషమని పీయూష్ గోయల్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story