మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి నోటీసులు అంటించిన అధికారులు

మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి నోటీసులు అంటించిన అధికారులు

మాజీ సీఎం చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసానికి CRDA అధికారులు నోటీసులు అంటించారు. కరకట్టపై ఆయన నివాసం అక్రమ కట్టడమని నిర్థారించినందున.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులిచ్చారు. ఇంటి యజమాని లింగమనేని రమేష్‌ పేరునే ఈ నోటీసులు ఇచ్చారు. సీఆర్‌డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేంద్రరెడ్డి ఉండవల్లిలోని బాబు నివాసానికి వెళ్లి ఈ నోటీసులు అంటించారు. ఐతే.. ఇంట్లో అద్దెకు ఉంటున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ నోటీసులు తీసుకునే విషయంపై ఏమన్నారు.. వారు వీటిని తీసుకునేందుకు నిరాకరించినే బయట గోడకు వీటిని అంటించారా అనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఈ ప్రాథమిక ఉత్తర్వులు, షోకాజ్‌పై స్పందించి వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ లేఖలో పేర్కొన్నారు.

తాడపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో కృష్ణా నది కరకట్ట ప్రాంతంలో లింగమనేని రమేష్‌కి చెందిన ఈ ఎస్టేట్ ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. ఐతే.. చట్టపరమైన అనుమతి లేకుండా జీప్లస్ వన్ భవనం కట్టారని.. కరకట్టపై శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదన్న నిబంధనల ప్రకారం

అమరావతి నుంచి పాలన మొదలుపెట్టిన తర్వాత చంద్రబాబు తన మకాంను హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని లింగమనేని ఎస్టేట్‌‌కు మార్చారు. ఐదేళ్లుగా ఇక్కడే అద్దెకుంటున్నారు. ఐతే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరకట్టలపై అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రజావేదిక నేలమట్టమైంది. ప్రజావేదికతో పోలిస్తే నదికి మరింత సమీపంలో చంద్రబాబు నివాసం ఉంటుంది కాబట్టి ఇది కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇల్లేనంటూ CRDA తీర్మానించింది. అందుకే ఇవాళ నోటీసులు ఇస్తోంది. దీనికి.. సంబంధిత వ్యక్తులు ఇచ్చే వివరణ బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story