చిన్నపాముని చంపడానికి పెద్ద కర్ర కావాలా అన్నాడు.. అంతలో పాము..

చిన్నపాముని చంపడానికి పెద్ద కర్ర కావాలా అన్నాడు.. అంతలో పాము..

పాము చిన్నదైనా పెద్దదైనా దాని కోరల్లో విషం ఉంటుందన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. కాలితో తొక్కి చంపేద్దామనుకున్నాడు. ఆ క్రమంలోనే పాము అతడిని కాటేసింది. 10 నిమిషాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. హిందూపురం పరిగి రోడ్డు మీదకు పాము ఒకటి వచ్చింది. కొంత మంది పిల్లలు దాన్ని చూసి కర్రలతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అంతలో అహ్మద్ నగర్ కమేళ ప్రాంతానికి చెందిన సులేమాన్(50) అనే వ్యక్తి వచ్చి.. చిన్న పాముకి అంత భయపడతారు దేనికి. దాన్ని చంపడానికి కర్రలు కూడా కావాలా ఏంటి అని కాలుతో తొక్కాడు. దాంతో పాము అతడి కాలుపై రెండు సార్లు కాటేసింది. అయినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా పాములో కదలికలు లేకపోయేసరికి చనిపోయిందనుకుని చేత్తో పట్టుకున్నాడు. ప్రాణాలతోనే ఉన్న ఆ పాము అతడి చేయిపైన కూడా కాటేసింది. దీంతో సులేమాన్ నోటి నుంచి నురగ వచ్చి 10 నిమిషాల్లో కిందపడిపోయాడు. స్థానికులు హుటాహుటిన అతడిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు సులేమాన్ అప్పటికే మ‌రణించాడని నిర్ధారించారు.

Tags

Next Story