ఏంటీ గుడ్లు అప్పగించుకుని చూస్తున్నావ్.. నేనే రంగంలోకి దిగుతున్నా.. - బిగ్ బాస్

ఏంటీ గుడ్లు అప్పగించుకుని చూస్తున్నావ్.. నేనే రంగంలోకి దిగుతున్నా.. - బిగ్ బాస్

బుల్లి తెర మీద సెన్సేషనల్ షో బిగ్ బాస్. తొలి రెండు సీజన్స్ లో దుమ్మురేపిన ఈ షో మళ్లీ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫస్ట్ సీజన్ లో తారక్, సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ లుగా వ్యవహరించారు. ఇక టాలీవుడ్ బిగ్ హీరోతో బిగ్ బాస్.. థర్డ్ సీజన్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. తొలి రెండు సీజన్లను బీట్ చేసేలా మూడో సీజన్ కు ప్రీపేర్ అవుతోంది. మొదటి రెండు సీజన్లకు మించి ఉండేలా టాలీవుడ్ పెద్ద హీరోతో రియాల్టి షోను డిజైన్ చేసుకుంది బిగ్ బాస్ టీం. అతనే బిగ్ స్క్రీన్ రోమాంటిక్ హీరో కింగ్ నాగార్జున.

ఈ షోను లీడ్ చేసే హోస్ట్ రోల్ ఎప్పుడూ ప్రత్యేకమే. బిగ్ బాస్ సీజన్ వన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అందరిని మెప్పించాడు. మొదట్లో బిగ్ బాస్ జనంలోకి వెళ్లేందుకు కొద్ది సమయం పట్టినా..ఆ తర్వాత రియాల్టి షోలో కిక్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో షోని మరింత రక్తి కట్టించాడు. ఆ తర్వాతి సీజన్ కు హీరో నాని బిగ్ బాస్ కి హోస్ట్ గా సెలక్ట్ చేశారు. ప్రారంభంలో కొద్దిగా నిరాశ పరిచినా..ఆ తర్వాత నేచురల్ స్టార్ రియాల్టి షోను బాగానే ప్రజెంట్ చేశాడు.

బిగ్ బాస్ మొదటి సీజన్ 70 రోజులు ప్లాన్ చేశారు. 16 మంది హౌజ్ మేట్స్ తో ప్రారంభమైన షో.. ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తించటంతో సక్సెస్ అయింది. హౌజ్ మేట్స్ మధ్య వివాదాలు, ఎలిమేషన్ రౌండ్లు ఆడియన్స్ లో ఉత్కంఠతను పెంచాయి. సెకండ్ సీజన్ లో హౌజ్ లో ఉండాల్సిన గడువు 112 రోజులకు పెరిగింది. కంటెస్టెంట్ల సంఖ్యను కూడా 18కి పెంచారు. సీజన్ వన్ తో పోలిస్తే సీజన్ టూ ఎక్కువ వివాదాలకు కేంద్రంగా మారింది. విన్నర్ కౌశల్‌కు హౌజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా వివాదాలు వెంటాడాయి.

ఇక ఇప్పుడు మూడో సీజన్ సమయం ఆసన్నమైంది. తొలి రెండు సీజన్లను బీట్ చేసేలా మూడో సీజన్ కు ప్రీపేర్ అవుతోంది. అందులో భాగంగానే ఓ వీడియోని రిలీజ్ చేసింది బిగ్‌బాస్ టీం. 'ఏంటీ గుడ్లు అప్పగించుకుని చూస్తున్నావ్ గుడ్లు ఇవ్వు.. నవనవలాడే లేత వంకాయలు ఓ 25కిలోలు ఇవ్వు.. 14 మంది 100 రోజులు ఒక బస్తా ఏం సరిపోతుంది..' అంటూ ఆ వీడియోలో నాగార్జున చెప్పే డైలాగులు చూస్తుంటే.. ఈ సీజన్ 100 రోజులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక 14 మంది హౌజ్ మేట్స్ తో థర్డ్ సీజన్ స్టార్ అయ్యోలా తెలుస్తోంది. ఇక ఈ వీడియోలో నేనే రంగంలోకి దిగుతున్నా అంటూ నాగార్జున చెబుతున్న డైలాగ్ ఆడియన్స్ లో ఆసక్తిని క్రియోట్ చేసేలా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story