ఆంధ్రప్రదేశ్

టీవీ5 ఎఫెక్ట్.. ఆ ఉద్యోగులకు జీతాలు..

టీవీ5 ఎఫెక్ట్.. ఆ ఉద్యోగులకు జీతాలు..
X

ఏపీ దేవాదాయశాఖలో ఉద్యోగుల వెతలపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఉద్యోగులకు జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ అయ్యాయి.

ఏపీ దేవాదాయశాఖలో ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. ఉద్యోగుల ఇబ్బందులను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో గత కొన్ని నెలలుగా జీతాలు లేక దేవదాయ శాఖ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన టీవీ5.. ఉద్యోగుల ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపింది. ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందని వైనంపై వరుస కథనాలు ప్రసారం చేసింది. టీవీ5 ఎఫెక్ట్‌తో ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు.. ఉద్యోగుల అకౌంట్లో జీతాలు జమ చేశారు.

Next Story

RELATED STORIES