వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం

ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది పులివెందుల కోర్టు. ఈ హత్య కేసు నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్...అరెస్టై 90 రోజులు పూర్తి కావడంతో... బెయిల్ మంజూరు చేసింది. ఈ ముగ్గురిని.. వివేకా హత్య కేసులో..... సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై అరెస్ట్ చేశారు. దాదాపు మూడు నెలలైనా ఈ కేసులో నిందితులపై పోలీసులు ఛార్జ్‌షీట్ చేయకపోవడం,విచారణ పూర్తి కాకపోవడం వంటి అంశాలను పరిశీలించిన కోర్టు... వీరికి బెయిల్ మంజూరు చేసింది.
వైఎస్ సోదరుడు, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని... కడప జిల్లా పులివెందులలోని తన ఇంట్లోనే గొడ్డలితో నరికి చంపారు. భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ సునీత హైదరాబాద్‌లో ఉంటుండగా... వివేకా ఒక్కరే పులివెందులలోని సొంత ఇంట్లో ఉంటున్నారు. ఒంటరిగా ఉన్న వివేకాను దారుణంగా హత్య చేశారు. ఆయన నుదుటిపైన, తల వెనుక, రెండువైపులా నాలుగు చోట్ల గొడ్డలితో బలంగా దాడి చేసిన గాయాలు కనిపించాయి. కుడి చేయి, కుడి తొడ, ముక్కు దగ్గర బలమైన గాట్లు ఉన్నాయి. మొత్తం 7 చోట్ల గొడ్డలితో తీవ్రంగా గాయపరిచినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
RELATED STORIES
Khammam : కృష్ణయ్య హత్య కేసులో పరారీలో ఉన్న అతనే ఏ1..
20 Aug 2022 1:45 AM GMTMunugodu : మునుగోడులో వర్షం.. షాక్‌లో నాయకులు..
19 Aug 2022 3:52 PM GMTHyderabad : విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి కారణం అదే..
19 Aug 2022 2:06 PM GMTMunawar Faruqui : మునావర్ ఫారూఖీపై ఎలా దాడి చేస్తారో చెప్పిన ఎమ్మెల్యే...
19 Aug 2022 1:44 PM GMTRTC MD : తగిన బుద్ధి చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
19 Aug 2022 1:15 PM GMTNarayana College : నారాయణ కాలేజీ యాజమాన్యం వేధింపులు.. పెట్రోల్‌తో...
19 Aug 2022 12:24 PM GMT