విషాదం.. గోడ కూలి 15 మంది మృతి.. శిథిలాల కింద మరికొందరు..

విషాదం.. గోడ కూలి 15 మంది మృతి.. శిథిలాల కింద మరికొందరు..

వరుణుడు ముంబై నగరాన్ని వణికిస్తున్నాడు. జోరున కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజాజీవనం అస్థవ్యస్థమవుతోంది. ఈనేపథ్యంలో పూణేలోని కుంద్వాలో గోడ కూలి 15 మంది మ‌తి చెందారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని కొంధ్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తులో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story