కాలేజీలో యువకుడిపై..
అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. చదువు, సంస్కారం నేర్చుకోవాల్సిన కాలేజీల్లో ఇప్పటికీ గ్యాంగ్ వార్‌లు కొనసాగుతున్నాయనడానికి ఈ దృశ్యాలే ఉదాహరణ. ఆర్ట్స్ కాలేజీలోని కామ్స్ బిల్డింగ్ ముందున్న గ్రౌండ్‌లో శివయ్య అనే యువకుణ్ని ఓ వర్గం విద్యార్థులు చావగొట్టారు.. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.. విద్యార్థుల దాడిలో గాయపడ్డ శివ స్పృహ తప్పి కిందపడిపోయాడు.. అయినా వదల్లేదు.. చేతికి దొరికిన ఆయుధంతో రాక్షసుల్లా మీద పడ్డారు.. బెల్టులు, చైన్లు, ఇనుప రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు.. ఓ విద్యార్థి అయితే కాలితో గొంతుపై బలంగా తన్నాడు.. ఈ దృశ్యాలన్నిటినీ అక్కడే వున్నవారు తమ మొబైల్‌లో రికార్డ్ చేశారు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. యువకుడిపై దాడిచేస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో పోలీసులు హుటాహుటిన విచారణ చేపట్టారు. కాలేజీకి వెళ్లి వివరాలు ఆరా తీశారు.
యువకుడిపై దాడి వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.. శివయ్యపై కక్ష పెంచుకున్న కొంతమంది విద్యార్థులు ఈనెల 25న ఫోన్ చేసి కాలేజీకి పిలిపించారు.. అప్పటికే మాటు వేసి వున్న స్టూడెంట్ గ్యాంగ్ శివయ్య గ్రౌండ్ దగ్గరకు రాగానే అతనిపై విరుచుకుపడింది.. మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. శివయ్య స్పృహ కోల్పోయినా కనికరం లేకుండా ఉన్మాదుల్లా కొడుతూనే ఉన్నారు.. అయితే, ఈ విషయంలో తన తప్పేమీ లేదని బాధితుడు చెబుతున్నాడు..
అటు ఈ గ్యాంగ్ వార్ ఘటన అనంతపురంలో కలకలం రేపింది.. ఈ వీడియోను చూసిన వారంతా వీళ్లు విద్యార్థులా.. వీధి రౌడీలా అని అంటున్నారు.. మరోవైపు ప్రశాంత వాతావరణానికి నిలయంగా ఉన్న ఆర్ట్స్‌కాలేజీలో ఇలాంటి ఘటన వెలుగు చూడటంతో విద్యార్థులు భయపడిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ప్రిన్సిపాల్ చర్యలకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేస్తామని చెబుతున్నా
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com