లోకేష్‌పై విజయసాయి రెడ్డి విమర్శలకు దేవినేని అవినాష్ కౌంటర్‌

లోకేష్‌పై విజయసాయి రెడ్డి విమర్శలకు దేవినేని అవినాష్ కౌంటర్‌

వైసీపీ, టీడీపీల మధ్య ట్విట్టర్ వార్‌ నడుస్తోంది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. ట్విట్‌ చేసుకుంటున్నారు. మాజీ మంత్రి లోకేష్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చేసిన విమర్శలకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ ఘాటుగా స్పందించారు. 16 నెలలు జైల్లో ఉన్న ఏ1, ఏ2లు ఎవరి కాళ్లు పట్టుకుని బయట తిరుగుతున్నారని విమర్శించారు. రాజ్యసభ ఎంపీగా ప్రధాని కార్యాలయం చుట్టూ 5 ఏళ్ల పాటు ఎందుకు తిరిగారో చెప్పాలన్నారు. జగన్‌ పుట్టక ముందు నుంచి చంద్రబాబు నాయుడు మీద అవినీతి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా సాధించింది ఏంటో మీకే తెలియాలంటూ విజయసాయి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అవినాష్.

Tags

Next Story