సుకుమార్ ని మెప్పించిన "దొరసాని"

సుకుమార్ ని మెప్పించిన దొరసాని

నటులు జీవిత, రాజశేఖర్ ల చిన్న కూతురు శివాత్మిక దొరసాని చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంతోనే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయ అవుతుండటం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యష్ రంగినేని, మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు. కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడు.

తెలంగాణ గడీల నేపథ్యంలో సాగే ప్రేమకథగా, కె.వి.ఆర్ మహేంద్ర దర్శఖత్వంలో దొరసాని రూపొందింది. ఆల్ రెడీ రిలీజైన టీజర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. సినిమాని జూలై 12న విడుదల చేయబోతున్నారు. అయితే దొరసాని ట్రైలర్ ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదగా రిలీజ్ కాబోతుంది. టీజర్ చూసిన సుకుమార్, దొరసానికి ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. జూలై 1న ఉదయం 10 గంటలకు దొరసాని ట్రైలర్ రిలీజ్ అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story