అందులో జోక్యం చేసుకోకండి.. పుతిన్‌ కు స్వీట్ వార్నింగ్..

అందులో జోక్యం చేసుకోకండి.. పుతిన్‌ కు స్వీట్ వార్నింగ్..

పుతిన్‌ను మరోసారి హెచ్చరించారు ట్రంప్‌.. అయితే ఎప్పటిలాగే కాకుండా ఈసారి స్వీట్ వార్నింగ్‌ ఇచ్చారు. అమెరిక అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్ద రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ను అత్యంత సున్నితంగా కోరారు. జీ20 సదస్సులో పాల్గొన్న వీరిద్దరూ శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

భవిష్యత్తులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని పుతిన్‌ను హెచ్చరిస్తారా? అని అడిగారు మీడియా అడగ్డా వెంటనే దీనిపై స్పందించిన ట్రంప్ తాను తప్పకుండా పుతిన్‌ను హెచ్చరిస్తానన్నారు.

అధ్యక్షా, ఎన్నికల్లో జోక్యం చేసుకోకండి అని ట్రంప్ తన వేలును పుతిన్‌వైపు చూపిస్తూ అన్న ఆయన.. రెండో సారి అదే పదం రిపీట్‌ చేశారు. దీనిపై పుతిన్ మొదట నవ్వారు. ఆ తర్వాత తన అనువాదకురాలివైపు చూశారు. ఆమె ట్రంప్ చెప్పిన మాటలను అనువదించి చెప్పిన తర్వాత మరోసారి హ్యాపీగా నవ్వారు పుతిన్‌.. తరువాత ఇద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ తల ఊపుకుంటూ నవ్వుకున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో జరుగుతాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ ఆరోపణలను రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ తోసిపుచ్చారు. మరి ఈసారి ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story