యువతి స్నానం చేస్తుండగా తొంగి చూసిన..

యువతి స్నానం చేస్తుండగా తొంగి చూసిన..

యువతి స్నానం చేస్తుండగా.. బాత్రూమ్‌లోకి తొంగి చూశాడో ప్రబుద్ధడు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. కోర్టులో అటెండర్‌గా, విశ్రాంత న్యాయమూర్తి రమేష్ వద్ద పీఏగా పనిచేస్తున్న శివకుమార్‌ అనే వ్యక్తి ఆ దారుణానికి ఒడిగట్టాడు.

ఏదో పని మీద వెళ్తున్న శివకుమార్‌.. ఎదురు ఫ్లాట్‌లో అమ్మాయి స్నానం చేస్తోందని గ్రహించాడు. కారిడార్‌లోని స్టూల్‌ తీసుకెళ్లి బాత్రూమ్‌ దగ్గర వేసుకుని తొంగిచూశాడు. ఆ వెంటనే తనను ఎవరో గమనిస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే.. శివకుమార్‌ వేషాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోకి చూసిన శివకుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. అతడ్ని కఠినంగా శిక్షించాలని కోరింది. అయితే.. పోలీసులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని వాపోయింది. శివకుమార్‌ ఏం చేశాడో.. సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలు తీసుకునేందుకు ఇబ్బంది ఏంటని బాధితురాలు ప్రశ్నిస్తోంది. మరోవైపు.. నిందితుడిపై 354 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రిమాండ్‌కు తరలించామని సీఐ సుబ్బరాజు స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story