మోసం చేసిందనే అనుమానంతో.. యువతిని 12 సార్లు..

మోసం చేసిందనే అనుమానంతో.. యువతిని 12 సార్లు..

కర్ణాటకలో ఓ ఘటన జరిగింది. ప్రేమించి మోసం చేసిందనే అనుమానంతో ఓ యువకుడు, తన గర్ల్‌ ఫ్రెండ్‌పై కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఆమెను 12 సార్లు పొడిచాడు. ఆ తర్వాత తన మెడను తాను కోసుకున్నాడు. చివరికి స్థానికులు స్పందించి వారిద్దరినీ ఆస్పత్రికి తరలిం చారు. దక్షిణ కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసు కుంది.

దేరాలకట్టె ప్రాంతానికి చెందిన సుశాంత్, దీక్ష కొంతకాలంగా ప్రేమించుకుం టున్నారు. సుశాంత్ డ్యాన్సర్ కాగా, దీక్ష స్థానిక డిగ్రీ కాలేజీలో చదువుకుంటోంది. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో దీక్ష, సుశాంత్‌ ను దూరం పెడుతూ వచ్చింది. తనను వేధిస్తున్నాడంటూ సుశాంత్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌ లో కేసు కూడా పెట్టింది. దాంతో సుశాంత్ రగిలిపోయాడు. దీక్ష వేరే ఎవరినో ప్రేమిస్తోందని, అందుకే తనను దూరం పెడుతోందంటూ అనుమానం పెంచుకున్నాడు. అది కాస్తా పగగా మారింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం దీక్ష ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చి అడ్డుకున్నాడు. తనను వెళ్లనివ్వాలంటూ ఆమె చెబుతుండగానే కత్తితో దాడి చేశాడు. నాకు దక్కని నువ్వు ఇంకెవ్వ రికీ దక్కకూడదంటూ విచక్షణ రహితంగా 12 సార్లు పొడిచాడు.

కత్తితో సుశాంత్ డజను సార్లు పొడవడంతో దీక్ష కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న కొందరు, సుశాంత్‌ను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ అతని పైశాచిక ప్రవర్తనను చూసి వెనక్కి తగ్గారు. ఇక, దీక్షను పొడిచేసిన తర్వాత సుశాంత్ తనను తాను పొడుచుకున్నాడు. కత్తితో తన మెడను పలుమార్లు కోసుకొని దీక్ష పక్కనే కుప్పకూలిపోయాడు. అప్పటికే, అక్కడకు వచ్చిన గ్రామస్థులు, వెంటనే వాళ్లిద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story