సీఎం జగన్‌పై ట్విట్టర్‌లో లోకేష్ సెటైర్..

సీఎం జగన్‌పై ట్విట్టర్‌లో లోకేష్ సెటైర్..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. సీఎం జగన్‌పై మరోసారి ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. మాట మార్చమ్‌.. మడమ తిప్పమ్‌ అన్న జగన్ మాటలను కాస్త మార్చి.. మాట మార్చామ్‌.. మడమ తిప్పామ్‌ అని రాసి ఎద్దేవా చేశారు. నాడు పట్టిసీమకు వ్యతిరేకం అన్న జగనే‌.. చివరికి తన చేతితోనే పట్టిసీమ నీళ్లు వదిలారని సెటైర్‌ వేశారు.

దేవుడి స్క్రిప్ట్‌లోనూ ట్విస్ట్‌లు ఉంటాయి జగన్‌ గారూ అంటూ ట్వీట్‌ చేసిన లోకేష్‌.. దేవుడు స్క్రిప్ట్‌ రాస్తూ పూర్తిగా ముగించలేదు. రాస్తూ రాస్తూ కామా పెట్టాడంతే.. అది ఫుల్‌ స్టాప్‌ అని మీరు అనుకున్నారని రాశారు. అయితే దేవుడు కామా తర్వాత మళ్లీ స్క్రిప్ట్‌ రాయడం మొదలు పెట్టాడని.. మీరు అవినీతి అన్న పట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్‌ చేయించాడని.. అడ్డగోలన్న పోలవరం అంచనాలను యథాతథంగా కేంద్రంతో ఓకే చేయించాడని లోకేష్‌ ఎద్దేవా చేశారు. అలాగే టీడీపీ హాయంలో విద్యుత్‌ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే.. అవి ముట్టుకుంటే షాక్‌ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడన్నారు. భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ ఛాన్స్‌ ఇచ్చాడని... సచివాలయం సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా.. అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడైనా.. చంద్రబాబుగారికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకో అని స్క్రిప్ట్‌లో కామా పెట్టాడంటూ లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

Tags

Next Story