సీఎం జగన్ కు ట్విట్టర్‌ ద్వారా సలహా ఇచ్చిన ఎంపీ కేశినేని నాని

సీఎం జగన్ కు ట్విట్టర్‌ ద్వారా సలహా ఇచ్చిన ఎంపీ కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్‌ మీడియా పోస్టింగ్‌ పరంపర కొనసాగిస్తున్నారు. జగన్‌ - కేసీఆర్‌ చర్చలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో విభజన సమస్యలు పరిష్కారం దిశగా చర్చలు ప్రారంభించడం ఆహ్వానించదగ్గ పరిణామం.. కానీ దేవుడిచ్చిన మీ స్నేహితుడు కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి అనాథగా మారిన ఏపీకి రావాల్సిన బకాయిలు కూడా అడిగితే బాగుంటుందని ట్విట్టర్‌ ద్వారా సలహా ఇచ్చారు ఎంపీ నాని. మీరు సమస్యల పరిష్కారం పేరుతో తెలంగాణకు మేలు చేస్తున్నట్టుగా ఉంది. దీనిపై ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ వివరణ ఇస్తే బాగుంటుందన్నారు.

Tags

Next Story