అప్పుడే 'అమ్మ'కు పంచ్‌లు..

అమ్మని ఐస్ చేయాలంటే.. నువ్వు చాలా అందంగా ఉన్నావనో.. అదృష్ట వంతురాలివనో.. అంటే సరిపోతుందేమో.. అమ్మ కోపం ఇట్టే చల్లారిపోతుంది. అదే చేశాడు తెలివిగల ఓ మహిళా కేంద్ర మంత్రి కొడుకు. మోదీ కేబినెట్‌లో రెండోసారి చోటు దక్కించుకున్న స్మృతీ ఇరానీ.. కేంద్ర స్ర్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఆమె కుటుంబాన్ని మిస్సవుతున్నానంటూ ఇటీవల భావోద్వేగానికి లోనయ్యారు. శనివారం తన కుమారుడు జోహార్ ఇరానీ ఫోటో పోస్ట్ చేస్తూ దానికి హార్ట్ ఎమోజీని జత చేశారు. అమ్మ పోస్ట్‌కి స్పందించిన జోహార్.. చిన్నారి ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదా.. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అంటూ కామెంట్ చేశాడు. దానికి సమాధానంగా స్మృతి.. అవునా ఇంటికి రా చెప్తా.. ఎవరు ఎంత క్యూట్‌గా ఉన్నారో అంటూ బదులిచ్చారు. ఈ తల్లీ కొడుకుల సరదా సంభాషణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజంగానే మేడమ్.. మీలాగే మీ బాబు కూడా చాలా క్యూట్‌గా.. అందంగా ఉన్నాడు అని అంటున్నారు. ఇద్దరూ అదృష్టవంతులే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com