అలా జరిగితే శ్రీలంకకు సెమీస్ చేరే అవకాశం దక్కుతుంది!

ప్రపంచ కప్ రేసులో శ్రీలంక తడబాటు కంటిన్యూ అవుతోంది. ఇంగ్లండ్‌పై అనూహ్య విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకొన్న లంక టీం.. ఆ తర్వాతి మ్యాచ్‌లోనే చేతులెత్తేసింది. వాల్ట్ కప్ నాకౌట్ రేస్ నుంచి ఇప్పటికే ఔటైన దక్షిణాఫ్రికా చేతిలో లంక 9 వికెట్ల తేడాతో ఓడింది. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో వైఫల్యాల నుంచి బయటపడలేకపోయింది. బ్యాటింగ్ డిపార్ట్ మెంట్ ఫెయిల్యూర్ తో సెమీస్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది శ్రీలంక.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లంక ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడింది. ఇందులో కేవలం రెండు మ్యాచులు మాత్రమే నెగ్గి మూడు మ్యాచుల్లో ఓడిపోమింది. మరో రెండు మ్యాచులు వర్షార్పణం అయ్యాయి. దీంతో 6 పాయింట్లు సాధించిన శ్రీలంక.. సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా నెగ్గాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇతర జట్ల గెలుపోటములపై లంక సెమీస్ ఆశలు ఆధారపడి ఉంది.
ఈ రన్ రేట్ ఫజిల్ ఎదో అద్భుతాలు జరిగితే తప్ప లంకకు బయటపడే పరిస్థితులు లేవు. దీంతో ప్రపంచకప్ నుంచి ఆ జట్టు దాదాపుగా ఔటైపోయినట్టే. ఇంగ్లండ్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. దీనికితోడు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు తాము ఆడాల్సిన రెండు మ్యా చ్‌ల్లో కనీసం ఒక్కటి ఓడిపోవాలి. ఇలా జరిగితేనే లంకకు సెమీస్ చేరే అవకాశం దక్కుతుంది. ఈ లెక్క ఎక్కడ తప్పినా శ్రీలంక ఇంటికి వెళ్లాల్సిందే.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com