క్రికెట్‌లోనూ ఫుట్ బాల్ కాన్సెప్ట్‌ను ఫాలో అవుతారా?

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే పోరులో భారత జట్టు ధరించే ‘అవే’ జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. ముందు భాగంలో ముదురు నీలం రంగు... భుజాలు, వెనక భాగం పూర్తిగా నారింజ రంగుతో ఉన్న ఈ జెర్సీని ‘నైకీ’ సంస్థ రూపోదించింది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్ళు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతారు. భారత్, ఇంగ్లండ్ రెండు జట్ల జెర్సీలు నీలి రంగులో ఉండడంతో వాటీ మధ్య తేడా కోసం భారత్ ఆటగాళ్ళు గ్రే కలర్ జెర్సీని వేసుకోబోతున్నారు. ఫుట్‌బాల్ క్రీడా తరహాలో "హోం", "అవే" అనే పద్దతిని ఐసీసీ తొలిసారిగా ఈ ప్రపంచ కప్‌లో ప్రవేశపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ‘హోమ్’ టీమ్ కాగా, భారత్‌ను ‘అవే’ జట్టుగా నిర్ధారించారు.
మరోవైపు టిమిండీయా ధరించేబోయే న్యూజర్సీపై వివాదం చెలరేగుతూనే ఉంది. ఈ కొత్త రూల్ తీసుకురావడంపై క్రికెట్ ఎక్స్‌పర్ట్య్ విమర్శలు గుప్పిస్తున్నారు.సాకర్ తరహా విధానం క్రికెట్‌లో వినియోగించడం సరికాదని భావిస్తున్నారు. ఫుట్‌బాల్‌లో 22 మంది ఒకేసారి మైదానంలో ఉంటారు కాబట్టి ఎంపైర్ ఆటగాడిని కనిపెట్టడంలో ఇబ్బంది లేకుండా ఉండానికి వేరు వేరు రంగు జెర్సీలను ఆటగాళ్లు ధరిస్తారు . అయితే క్రికెట్‌లో అలా ఉండదు. మైదానంలో 11 మంది ఒకే జట్టుకు చెందిన ఆటగాళ్ళుతో పాటు ప్రత్యర్థి జట్టుకు చెందిన మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ క్రిజ్‌లో ఉంటారు. కాబట్టి ఇతర ఆటగాళ్లతో గందరగోళానికి తావు లేదు. అలాగే అభిమానులకు వారి జట్ల జెర్సీల రంగులు మనసులో ముద్రించుకుపోయే ఉంటాయి. దీంతో జెర్సీలు మార్చడం వల్ల ప్రేక్షకుల్లో కొంత అయోమయం నెలకొని ఉంటుంది. ఏదో ఒక సాకుతో ఇది జెర్సీలను మార్చే ప్రయత్నమే తప్ప వాస్తవంగా దీనికి అర్ధం లేదంటూ ఎక్స్‌పర్ట్య్ చెబుతున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com