వైఎస్ పాలనకు.. జగన్ పాలనకు..

వైఎస్ పాలనకు.. జగన్ పాలనకు..

ఏపీ సీఎం జగన్ తండ్రి వైఎస్ అడుగు జాడల్లో నడుస్తున్నారు. గతంలో వైఎస్ చేపట్టిన మాదిరిగానే ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జూలై 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజలు తనను నేరుగా కలిసేందుకు వీలుగా జగన్ ప్రజాదర్బార్ ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు గంట పాటు ఆయన ప్రజల వినతులు స్వీకరిస్తారు. అంతేకాదు సంక్షేమపథకాల్లో అవతవకలపై నేరుగా సీఎంకే ఫిర్యాదు చేయవచ్చు. ప్రజాదర్బారు కోసం సీఎంవో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags

Next Story