న్యూజిలాండ్‌పై ఆసీస్ గ్రాండ్‌ విక్టరీ

న్యూజిలాండ్‌పై ఆసీస్ గ్రాండ్‌ విక్టరీ

ప్రపంచ కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది ఆస్ట్రేలియా. ఇప్పటికే సేమీస్‌ చేరిన ఆ జట్టు...తాజాగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్‌ను ఉస్మాన్‌ ఖవాజా, కారే ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి కివీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుండి నడిపించారు. కానీ కీలక సమయంలో వీరిద్దరూ ఔట్‌ కావడంతో ఆసీస్‌ ఆశించినంత స్కోరు సాధించలేకపోయింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు మాత్రమే చేసింది.

ఆ తరువాత 244 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. ఆసీస్‌ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. లో స్కోరు మ్యాచ్‌లో చేతులెత్తేసింది. 43.4 ఓవర్లలో కేవలం 157 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్‌ స్టార్క్‌ విజృంభించడంతో కివీస్‌ టాప్‌ ఆర్డర్‌ గల్లంతైంది. కెప్టెన్‌ విలియమ్సన్‌ మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు.

స్టార్క్‌ ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. దీంతో 86 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. 7 విజయాలతో పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌ను నిలుపుకుంది. భారత్‌తో మినహా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియా గెలుపొందింది. మరోవైపు కివీస్‌ బౌలర్‌ బౌల్డ్‌ హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు. వరుసగా ఐదు విజయాలు సాధించిన న్యూజిలాండ్‌కు.. ఇది వరుసగా రెండో ఓటమి. అయితే 11 పాయింట్లతో ఆ జట్టు సెమీస్‌కు దగ్గర్లోనే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story