క్రికెట్ అభిమానం.. సూక్ష్మ రూపంలో బంగారు ట్రోఫీ..

క్రికెట్ అభిమానం.. సూక్ష్మ రూపంలో బంగారు ట్రోఫీ..

వరల్డ్‌కప్‌ క్రికెట్‌ ఫీవర్‌ ఢిల్లీ నుంచి గల్లీ వరకు క్రికెట్ అభిమానులను ఊపేస్తుంది. క్రికెట్‌పై మక్కువ ఉండే అభిమానాలు తమ ఇష్టాన్ని ఒక్కోరు ఒక్కోలా చాటుకుంటుంటారు. ఐతే శ్రీకాకుళం జిల్లా పలాసలోని కొత్తపల్లి రమేష్‌ అనే స్వర్ణకారుడు క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా వ్యక్తం చేశాడు. తన హస్తకళా నైపుణ్యంతో సూక్ష్మ రూపంలో బంగారు ట్రోఫీలను తయారు చేశాడు. 600 మిల్లీ గ్రాముల కేడీఎం బంగారంతో విన్నర్, రన్నరప్‌ కప్‌లను తయారు చేశాడు. భారత్ జట్టు తప్పకుండా ప్రపంచకప్‌ గెలుచుకుంటుందనే ధీమా విశ్వాసం వ్యక్తం చేశాడు రమేష్. ఐతే భారత్ క్రికెట్ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి తను తయారుచేసిన కప్‌ను అందించాలని ఉందని ఆకాంక్షను వ్యక్తం చేశాడు ఈ క్రికెట్ ప్రేమికుడు. రమేష్‌ టాలెంట్‌ను చూసి అక్కడి స్థానికులు మంత్రముగ్దులు అయ్యారు.

Tags

Next Story