సోషల్ మీడియా ద్వారా యువతులకు వల.. చేసే పని చూస్తే..
సోషల్ మీడియా ద్వారా యువతులకు వల వేస్తూ.. సొమ్ము వసూలు చేస్తున్న కేటుగాడి గుట్టు రట్టైంది. యానాంకు చెందిన కర్రి సతీష్ అనే యువకుడు.. ఇన్‌స్ట్రాగామ్ యాప్ ద్వారా అమ్మాయిలకు వల వేయడం.. తరువాత మాయమాటలు చెప్పి వారి దగ్గర సొమ్ములు కాచేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.. అలా అతడి వలలో చిక్కుకుని సూర్యపేటకు చెందిన ఓ యువతి 20 తులాల బంగారు అభరణాలను పెద్దలకు తెలియకుండా సతీష్‌కు ఇచ్చింది..
కారు కొనక్కునేందుకు.. యువతిని డబ్బులు అడిగితే.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా 20 తులాల బంగారం ఇచ్చింది. అయితే ఇంట్లో ఆభరణాలు కనిపించకపోవడంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో.. ఆ అభరణాలను ఇంటి నుంచి దొంగలించి యానం యువకుడికి ఇచ్చినట్టు యువత వెల్లడించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. ఇలా దాదాపు 25 మందికిపైగా యువతులను ట్రాప్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com