కల్తీ పాల దందా

కల్తీ పాల దందా

యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల దందా ఆగడం లేదు. S.O.T పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. కేసులతో జైల్లోకి నెడుతున్నా అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బి.ఎన్‌. తిమ్మాపురంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు చేసి మరో ముఠాను అరెస్టు చేశారు. 70 లీటర్ల పాలు, 5 లీటర్ల నూనె, ఇతర కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. పాల పౌడర్ ప్యాకెట్లను కూడా సీజ్ చేశారు. కల్తీ పాల దందా కేసులో మొన్న ఇద్దరు.. ఇవాళ మరో ముఠా అరెస్ట్ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఈ కల్తీపాలల్లో యూరియా లాంటి వాటిని కూడా వాడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పుడీ వ్యవహారం వెలుగులోకి రావడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్లు.. పాలు కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. వివిధ కంపెనీల పాల ప్యాకెట్లను కూడా కల్తీ చేస్తున్నారనే ఆందోళనతో పిల్లలకు పాలు పట్టాలన్నా టెన్షన్ పడుతున్నారు. అటు, ఈ కల్తీ వ్యవహారాల్లో నిందితులకు కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story