పాకిస్తాన్‌కూ ముచ్చెమటలు పట్టించిన ఆఫ్గనిస్తాన్
పాక్ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు.. ఆ మాటకొస్తే చివరి వరకు వారికే అర్థం కాదు.. ఇదే పరిస్థితి ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కనిపించింది.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు పడింది.. చివరి ఓవర్ వరకు పోరాడింది.. ఆఫ్గాన్‌పై విజయంతో పాక్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
మొన్న భారత్‌ను వణికించిన ఆఫ్గనిస్తాన్ తాజాగా పాకిస్తాన్‌కూ ముచ్చెమటలు పట్టించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చచ్చీ చెడీ గెలిచింది. ఆఫ్గాన్‌పై విజయంతో పాక్ సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది. ఆఫ్గనిస్తాన్ ఇచ్చిన అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్ నానా తంటాలు పడింది.. చివరకు మరో రెండు బంతులు మిగిలివుండగా లక్ష్యాన్ని ఛేదించింది..
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.. ఆస్గర్, నజీబుల్లా జద్రాన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు.. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌కు ఆఫ్గన్ కీ బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు.. ఓ సమయంలో ఆఫ్గన్ జట్టు 125 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, నజీబుల్లా కీలక ఇన్నింగ్స్‌తో ఆ జట్టు 227 పరుగులు చేయగలిగింది.
228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరంభంలోనే తడబడింది.. ఆఫ్గాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెనువెంటనే వికెట్లు కోల్పోయింది.. ఆఫ్గన్ స్పిన్నర్లు పాక్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించడంతో 156 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.. ఈ టైమ్‌లో పాక్‌కు పరాభవం తప్పదేమోనన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది. దీనికితోడు చివరి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. అయితే, ఇమాద్ వాసిమ్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో విజయం పాక్‌కే దక్కింది.. ఈ విజయంతో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి చేరింది. జులై 5న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది పాక్.. ఆమ్యాచ్‌లో గెలిస్తే పాక్ సెమీస్ చేరే అవకాశాలున్నాయి.. అయితే, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోతేనే పాక్‌కు సెమీస్ ఛాన్స్ దక్కుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com