30 Jun 2019 10:15 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / ఉత్తరకొరియా భూభాగంలోకి...

ఉత్తరకొరియా భూభాగంలోకి అడుగుపెట్టిన ట్రంప్, కిమ్..

ఉత్తరకొరియా భూభాగంలోకి అడుగుపెట్టిన ట్రంప్, కిమ్..
X

ప్రపంచదేశాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ లు కలుసుకున్నారు. దక్షిణ, ఉత్తర కొరియా సరిహద్దులోని సైనిక రహిత గ్రామమైన పన్మున్ జోన్ గ్రామంలో ఇరువురు నేతలు కలిశారు. ట్రంప్ ను కలుసుకోవడం సంతోషంగా ఉందని కిమ్ అనగా... మా ఇద్దరిమధ్య గొప్ప స్నేహబంధం ఉందని, ఇక్కడికి వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు ట్రంప్.

ఈ సందర్భంగా సరిహద్దుకు అటుగా ఉన్న ఉత్తరకొరియా భూభాగంలోకి కిమ్ తో కలిసి ట్రంప్ అడుగు పెట్టారు. ఈ సమావేశంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కూడా పాల్గొని కిమ్ తో కరచాలనం చేశారు. మా సమావేశం దురదుష్టకరమైన గతాన్ని తొలగించి కొత్త భవిష్యతకు నాందిగా నిలుస్తుందని కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా మూడు దేశాల అధినేతలు నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా కనిపించారు. ఇది చారిత్రక సమావేశమని పరిశీలకులు చెపుతున్నారు.

Next Story