తిరుమలలో ఆ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తాం : వైవీ సుబ్బారెడ్డి

తిరుమలలో ఆ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తాం : వైవీ సుబ్బారెడ్డి

తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. సర్వదర్శనం క్యూలైన్‌, దివ్య దర్శనం, సూపథం క్యూలైన్‌లలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. క్యూలైన్‌ సిస్టంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని సుబ్బారెడ్డి తెలిపారు. త్వరిత గతిన భక్తులకు దర్శన భాగ్యం కలిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి.

Tags

Next Story