ఆ నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు..

ఆ నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు..

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అధికార వైసీపీలో ఆదిపత్య పోరు మొదలైంది. తిరుపతి రూరల్‌ మండలం మల్లంగుంట పంచాయతీలో మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ మునికృష్ణా రెడ్డిపై కొందరు దాడి చేశారు. దాడిలో మునికృష్ణా రెడ్డి తలకి బలమైన గాయమైంది. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నై ఆపోలో ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల ఎన్నికలకు ముందే కృష్ణా రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. అయితే ఈ దాడి వైసీపీ వాల్లే చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. మునికృష్ణా రెడ్డిపై దాడికి నిరసనగా.. గ్రామ ప్రజలంతా ఆ కుటుంబానికి మద్దతుగా నిలిచారు.

Tags

Next Story