ఆవేశం.. బకెట్ నీళ్ల కోసం ప్రియురాలిని..

ఆవేశం.. బకెట్ నీళ్ల కోసం ప్రియురాలిని..

నేనేమైనా నీ భార్యనా.. పెళ్లికి ముందే ఈ ఆర్డర్స్ ఏంటి.. నేను తీసుకురాను.. ఆ నీళ్లేదో నువ్వే తెచ్చుకో పో.. అని ఖరాఖండిగా చెప్పింది. అందుకే అతగాడికి తిక్క రేగింది. బకెట్ నీళ్లడిగినందుకు ఇంత రాద్ధాంతం చేస్తావా.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. కత్తితో ప్రియురాలిని పొడిచేశాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని వెస్ట్ భూమ్ సింగ్ జిల్లా మహిసబేదా గ్రామానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. శనివారం ఇద్దరూ షాపింగ్‌కి వెళ్లి యువతి వుంటున్న అద్దె ఇంటికి తిరిగి వచ్చారు. స్నానం చేసి వస్తాను.. చెమటతో చిరాగ్గా ఉంది. ఓ బకెట్ నీళ్లు తెచ్చి పెట్టు అని అడిగాడు. పక్కనే కుళాయి వుంది. నువ్వే వెళ్లి తెచ్చుకో అని సమాధానం ఇచ్చింది యువతి. ఈ చిన్న విషయానికి ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. యువకుడు ఆగ్రహంతో కిచెన్‌లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి ఆమెపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న స్నేహితురాలు హుటా హుటిన అక్కడికి వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించింది. వైద్యుల పర్యవేక్షణలో అమె మృతి చెందినట్లు నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story