సర్కారు ఘనకార్యం.. లబ్దిదారులకు ఇవ్వాల్సిన వాటిని ..

సర్కారు ఘనకార్యం.. లబ్దిదారులకు ఇవ్వాల్సిన వాటిని ..

లబ్దిదారులకు ఇవ్వాల్సిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను..... హాస్టల్స్‌గా మార్చేసింది కేసీఆర్‌ సర్కారు. నల్గొండ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అర్హులైన లబ్దిదారులందిరకీ .. డబుల్‌ బెడ్‌ రూం కట్టించి ఇస్తాంటూ అనేక సార్లు హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి మాటలతో.... అటు పేదవాళ్లు సైతం ఈ డబుల్‌బెడ్ రూం ఇళ్లపై గంపెడాశ పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఆ ఇళ్లలోకి వెళ్తామా? అని కలలు కంటున్నారు.

అయితే లబ్ధిదారుల ఆశల్ని వమ్ము చేస్తూ... నల్గొండ జిల్లా కలెక్టర్‌ చిత్రమైన నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే సిద్ధమైన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను..... మెడికల్‌ కాలేజీ స్టూడెంట్స్‌, టీచింగ్‌ స్టాఫ్‌, సిబ్బందికి కేటాయించారు. ఈ మేరకు ఈ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు... నేమ్‌ బోర్డులు సైతం ఏర్పాటు చేశారు.

జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో కాలేజీకి కావాల్సిన అదనపు తరగతి గదుల నిర్మాణం జోరుగా సాగుతోంది. అయితే.. అసలు చిక్కాంతా ఇక్కడే మొదలైంది. మెడికల్‌ విద్యార్ధులు, టీచింగ్‌ స్టాఫ్, సిబ్బందికి కావాల్సిన వసతి గృహాల కొరత ఏర్పడింది. దీంతో.... నల్గొండ శివారులో నిర్మిస్తోన్న ఈ డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను.... హస్టళ్లుగా మారుస్తూ కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు.... మెడికల్‌ కాలేజీ బాయ్స్‌ హాస్టల్‌, గర్ల్స్‌ హాస్టల్‌, స్టాఫ్‌ హాస్టల్‌ అంటూ ఏకంగా బోర్డులు సైతం వెలిశాయి. ఇప్పటికిప్పుడు మెడికల్‌ కాలేజీ స్టూడెంట్స్‌కు హాస్టల్‌ నిర్మించే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు....

డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై ఎంతో ఆశలు పెట్టుకున్న లబ్దిదారులు..... కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయంతో ఖంగు తిన్నారు. మరోసారి ప్రభుత్వం... తమకు మొండిచేయి చూపించిందంటూ విమర్శిస్తున్నారు లబ్దిదారులు...మొత్తానికి.... త్వరలోనే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లలోకి వెళ్తామని ఆశలు పెట్టుకున లబ్దిదారులు...తాజా నిర్ణయంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story