నిండు గర్భిణి అని కూడా చూడకుండా.. మానవత్వం మరిచి..

అమ్మ కడుపులోనుంచి బయటకైనా రాలేదు. ప్రపంచం ఎంత దారుణంగా ఉందో తెలియడానికి. ఆమె మీద ఎందుకు కక్ష గట్టారో కానీ.. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా కత్తితో దాడి చేశారు. మనుషుల్లో మానవత్వం నశించిపోయిందని రుజువు చేశారు. ఈ దాడిలో మహిళ మృతి చెందగా కడుపులోని బిడ్డను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు. లండన్ క్రొయిడన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కత్తి పోట్లకు గురై రోడ్డు మీద అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తక్షణ చికిత్సను ప్రారంభించినా లాభం లేకపోయింది. ఆమె బ్రతికే అవకాశాలు లేవని భావించిన వైద్యులు కనీసం ఆమె కడుపులోని బిడ్డనైనా కాపాడుదామనుకుని శస్త్ర చికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. కొన ఊపిరితో కొట్టుకులాడిన అమ్మ బిడ్డను వదిలి వెళ్లిపోయింది. అయితే బిడ్డ పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళపై దాడి చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
RELATED STORIES
Nandyala: ప్రేమ పేరుతో వాలంటీర్ మోసం.. యువతికి రెండుసార్లు అబార్షన్..
25 May 2022 10:30 AM GMTRangareddy District: తండ్రి వేధింపులు తట్టుకోలేక కూతురు ఆత్మహత్య.....
24 May 2022 12:20 PM GMTNizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTRangareddy District: రెండో పెళ్లికి సిద్ధమయిన రైల్వే ఉద్యోగి.. ఇంతలోనే ...
23 May 2022 2:30 PM GMTEluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..
23 May 2022 9:45 AM GMTKerala Vismaya Death: వరకట్న వేధింపులకు బలైన డాక్టర్ : దోషిగా రుజువైన...
23 May 2022 9:30 AM GMT