గుడ్‌న్యూస్.. జులై 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ ధర..

గుడ్‌న్యూస్.. జులై 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ ధర..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ యూజర్లకు అదిరిపోయే తీపి కబురు అందించింది. జులై 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.100.50 తగ్గనుంది. నాన్‌-సబ్సిడైజ్డ్ ఎల్‌పీజీ సిలిండర్ ఇక నుంచి రూ.637కు లభ్యం కానుంది. ఇంతకు ముందు ధర రూ.737.50 ఉండేది. ఈ మేరకు ఐఓసీ కంపెనీ ప్రకటనను జారీ చేసి ధరల తగ్గుదలను ధ్రువీకరించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్‌పీజీ రేట్లు దిగిరావడం, అమెరికా డాలర్-ఇండియన్ రూపాయి మారకపు విలువ సానుకూలంగా ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ధర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. సబ్సిడీ ఎల్‌పీజీ రేటు కూడా రూ.494.35కు దిగిరానుంది. మిగిలిన కూ.142.35లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. ఈ సబ్సిడీ మొత్తం బ్యాంక్ అకౌంట్‌లో జమవుతుంది.

Tags

Next Story