కర్నాటకలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం

కర్నాటకలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం

కర్నాటకలో మళ్లీ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాబాట పట్టారు. సీఎం కుమారస్వామి అమెరికాలో ఉండగా జరుగుతున్న పరిణామాలు అధికారపార్టీని కలవరపెడుతున్నాయి. విజయనగర అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఇప్పటికే స్పీకర్ కు తన రాజీనామా పత్రం సమర్పించారు. అటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడుస్తారని తెలుస్తోంది.

బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల్‌లో భాగంగానే కమలదళమే రాజీనామా చేయిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారు బీజేపీలో చేరితే వేటు వేయడానికి స్పీకర్ సిద్దంగా ఉన్నారు. దీని వల్ల బీజేపీకి కలిగే లాభం లేదు. కాబట్టి వారితో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని యెడ్యూరప్ప ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగానే వారితో రాజీనామ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఇందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. బళ్లారి ప్రాంతంలో జిందాల్ ప్రాజెక్టు భూసేకరణకు వ్యతిరేకంగానే నిర్వాసితులకు మద్దతుగా రాజీనామా చేసినట్టు చెబుతున్నారు.

Tags

Next Story