ఎర్రచందనం స్మగ్లర్లకు ఆహారం తీసుకెళ్తున్న కారు సీజ్‌

ఎర్రచందనం స్మగ్లర్లకు ఆహారం తీసుకెళ్తున్న కారు సీజ్‌
X

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లకు ఆహార వస్తువులు రవాణా చేస్తున్న కారును టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. కరకంబాడి రోడ్డులోని భూపాల్ కాలనీ వద్ద అనుమానాస్పదంగా శ్యాంట్రో కారు కనిపించడంతో దానిని పోలీసులు వెంబడించారు. కారు అడవిలోకి వెళ్లే మార్గం వద్ద ఆగడంతో.. అనుమానం దానిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని చూసిన కారు డ్రైవర్ కారు దిగి అడవిలోకి పారిపోయాడు. కారులో బియ్యం బస్తాలు, కూరగాయలు, టిఫిన్ ప్యాకెట్‌లు ఉన్నాయి. అడవిలో 20 మందికిపైగా ఉన్న స్మగ్లర్లకు ఇవి తరలించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి ఐజి కాంతారావు చేరుకుని పరిస్థితిని సమిక్షించారు. డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా స్మగ్లర్ల అచూకీ కోసం గాలిస్తున్నారు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది.

Tags

Next Story